: బీజేపీ నేత మోహన్ రెడ్డిని పరామర్శించిన పవన్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ నేత మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ముస్తాబాద్ నుంచి సిరిసిల్లకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఆ వెంటనే ఆయన్ను హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రమాదం తీరుపై అనుమానాలున్నాయనీ.. ప్రత్యుర్థులు, ఇసుక మాఫియా పాత్రపై గవర్నర్ విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుగుతారని ఇలాంటి ప్రమాదాలు జరిపించడం సరికాదన్నారు.