: టీడీపీకి మహాలక్ష్మి శ్రీనివాస్ రాజీనామా
ఎన్నికల ముందు అనంతపురం జిల్లాలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా అర్బన్ టీడీపీ ఇన్చార్జి మహాలక్ష్మి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని తెలిపారు. పార్టీ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆయన తెలిపారు. సీఎం రమేష్ కారణంగా తనకు న్యాయం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపులో తనకు ప్రాధాన్యత నివ్వకపోవడంతో తాను పార్టీ వీడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.