: సీమాంధ్రలో బీజేపీ ప్రచార బాధ్యతలు కృష్టంరాజుకు
భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేసేందుకు నటుడు, పార్టీ నేత కృష్టంరాజును రంగంలోకి దింపారు. ఈ మేరకు ప్రచార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తొలుత ఈ బాధ్యతలు పురందేశ్వరి నిర్వహించగా ఆమె రాజంపేట లోక్ సభకు పోటీ చేస్తుండటంతో తన ప్రచారంలో బిజీ అయ్యారు. దాంతో, ప్రచార కమిటీ కన్వీనర్ గా ఆయనను నియమిస్తున్నట్లు బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు ప్రకటన చేశారు. అయితే, కాంగ్రెస్ తరపున ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్న చిరంజీవికి పోటీగానే కృష్టంరాజును తీసుకొచ్చినట్లు కొంతమంది అంటున్నారు.