: రాహుల్ పై వ్యాఖ్యలు చేసిన రాందేవ్ పై కేసు నమోదు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై లక్నోలో కేసు నమోదైంది. హనీమూన్, విహార యాత్ర కోసం రాహుల్ దళితుల ఇళ్లకు వెళుతున్నారంటూ వివాదాస్పదంగా మాట్లాడిన ఆయనపై కొంతమంది దళిత కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా, రాందేవ్ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News