: నాలుగు కిలోల పుత్తడి పట్టుబడింది


అనంతపురం జిల్లా గుంతకల్లులో నాలుగు కిలోల బంగారంతో పాటు కిలో వెండి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గుంతకల్లులోని హనుమాన్ సెంటర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా 4 కిలోల బంగారం, కిలో వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ బంగారం, వెండిని గుంటూరు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News