: మరణం తర్వాత నా ఆస్తులన్నీ మెదక్ వాసులకే: విజయశాంతి ప్రకటన
తాను చనిపోయిన తర్వాత తన ఆస్తులన్నీ మెదక్ వాసులకే రాసిచ్చేస్తానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి సంచలన ప్రకటన చేశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయశాంతి ఈ రోజు రామాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఆస్తులపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి వెనకేసుకున్నది ఏమీ లేదని, ఏమైనా ఉంటే అవి మెదక్ వాసులకే ఇచ్చేస్తానన్నారు.