: కేసీఆర్ నీటిని ఆపేస్తాడా?... అదేమన్నా బాత్ రూంలో కుళాయా?: కిరణ్ కుమార్ రెడ్డి


కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలను నమ్మవద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. పాతపట్నంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నీరు ఆపేస్తానని అవాకులు చవాకులు పేలుతున్నాడని, అవేమన్నా కేసీఆర్ బాత్ రూం లోని కుళాయి నీరా? అని ప్రశ్నించారు. ఎలా నీటిని ఆపేస్తాడని ఆయన నిలదీశారు. ఈ నినాదం ప్రజలదని, తాను ప్రజల కోసం జైసమైక్యాంధ్ర పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.

తెలుగు జాతి మీద, తెలుగు ప్రజల మీద ప్రేమ ఉండే వారంతా ఎవరికి ఓటేస్తారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర పార్టీకి ఓటేసి గెలిపించాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకా? లేక మద్దతిచ్చిన బీజేపీకా? లేక రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని లేఖలు రాసిన టీడీపీకా? అని ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.

  • Loading...

More Telugu News