: నోకియా కొనుగోలును పూర్తి చేసిన మైక్రోసాఫ్ట్


రెండు దిగ్గజాలు ఒక్కటయ్యాయి. మైక్రోసాఫ్ట్ లో నోకియా విలీనం పూర్తయింది. నోకియా డివైజెస్, సర్వీసుల వ్యాపార కొనుగోలును పూర్తి చేసినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. నోకియా కొనుగోలుకు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 25వేల మంది నోకియా ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. 544కోట్ల యూరోలతో నోకియా మొబైల్స్, సేవల వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ లోగడ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, కోర్టు కేసులు, పన్నుల వివాదాల కారణంగా భారత్ లోని నోకియా ప్లాంట్(చైనా) మైక్రోసాఫ్ట్ చేతికి వెళ్లలేదు.

  • Loading...

More Telugu News