: అమెరికన్లను కిడ్నాప్ చేయండి: అల్ ఖైదా చీఫ్ పిలుపు
పాశ్చాత్య దేశాల వారిని ముఖ్యంగా అమెరికన్లను కిడ్నాప్ చేయాలని ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి శ్రేణులకు పిలుపునిచ్చారు. కిడ్నాప్ చేసిన వారిని అడ్డుపెట్టుకుని బంధీలుగా ఉన్న ఉగ్రవాదులను విడిపించుకోవాలని సూచించారు. ఈ మేరకు జవహరి ఇంటర్వ్యూతో కూడిన వీడియో విడుదలైంది. ఉగ్రవాద ఖైదీలను విడిపించుకోవడానికి ముస్లింలు పనిచేయాల్సి ఉందన్నారు. పశ్చిమదేశాల వారిని కిడ్నాప్ చేసి వారితో బంధీలను విడిపించుకోవాలని సూచించారు.