: బాలికను అపహరించి రోజులు తరబడి అత్యాచారం


దేశ రాజధానికి సమీపంలో 14 ఏళ్ల దళిత బాలికపై జరిగిన ఘోర అన్యాయం వెలుగు చూసింది. నోయిడా సమీపంలోని సలార్ పూర్ గ్రామంలో పెళ్లికి వెళ్లి వస్తున్న బాలికను ఈ నెల 17న ఏడుగురు యువకులు అపహరించుకుపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినా వారు కేసు నమోదు చేసుకోలేదు. ఈ లోపు అపహరించిన వారిలో ఐదుగురు బాలికపై వరుసగా ఎన్నోమార్లు అత్యాచారం జరిపారు. చివరకు ఈ నెల 20న అపహరించిన ప్రదేశంలోనే వదిలేసి వెళ్లిపోయారు. బాలిక ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. అయినా రాజీ చేసుకోవాలని వారు ఉచిత సలహా పడేసి, కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News