: నేడు తెలంగాణలో సుష్మా ప్రచారం


బీజేపీ అగ్రనాయకురాలు, లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ఈ రోజు తెలంగాణలోని పలుసభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 4.05 గంటలకు నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం వరంగల్ జిల్లా జనగాం, మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాదులోని జుమ్మేరాత్ బజారులో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత సుష్మా స్వరాజ్ తనను మీ 'చిన్నమ్మ' గా గుర్తుంచుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News