: నేడు భువనగిరి సభకు హాజరుకానున్న ప్రధాని


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ రోజు తెలంగాణకు రానున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం మోత్కూరు రోడ్డు లోని కూనూరు శివారులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న పరిశీలించారు. జిల్లాతో సహా ఇతర ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్టు కోమటిరెడ్డి సోదరులు తెలిపారు.

  • Loading...

More Telugu News