: సీఐఐ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని
రెండు రోజుల పాటు న్యూఢిల్లీలో జరగనున్న సీఐఐ (భారతీయ పరిశ్రమ సమాఖ్య) జాతీయ సదస్సును, సాధారణ వార్షిక సమావేశాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం ప్రారంభించనున్నారు. అనంతరం మన్మోహన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. దాదాపు 15వేల మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. 'ఇండియా టుమారో: ఇంపెరిటివ్స్ ఆఫ్ గ్రోత్, సెక్యూరిటీ, గవర్నెన్స్' థీమ్ పై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు.
కాగా, రెండోరోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక సదస్సులో ప్రత్యేకంగా ప్రసంగించనున్నారని ఆయన చెప్పారు. టెలికం మంత్రి కపిల్ సిబల్, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, ఆహార మంత్రి కెవి థామస్ కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు.