: వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తా: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఆలూరులో నిర్వహించిన రోడ్ షోలో బాబు మాట్లాడుతూ... ఓటు ద్వారా సోనియాకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ నడి వీధిలో నిలబెట్టిందని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హాలహర్వి మండలం గుళ్యం వేదావతి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా తాగునీరు, సాగునీరు అందిస్తామని బాబు అన్నారు. రైతు రుణమాఫీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని బాబు హామీ ఇచ్చారు.