: మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి...!


ఓ మైనర్ బాలికకు ప్రేమ కబుర్లు చెప్పి వలలో వేసుకుని, ఆపై ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను కెమెరాలో రహస్యంగా చిత్రీకరించాడు. అంతటితో ఆగక, ఆ వీడియోని స్నేహితుల సెల్ ఫోన్ కు పంపాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. నిందితుడు మాజీ కౌన్సిలర్ కుమారుడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జునైద్ ను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చీరాల సీఐ భీమా నాయక్ మీడియాకు వెల్లడించారు.

చీరాల ఉడ్ నగర్ కు చెందిన మైనర్ బాలికను, అదే ప్రాంతానికి చెందిన షేక్ జునైద్ ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి వాటిని తన స్నేహితుల సెల్ ఫోన్ లకు పంపాడని సీఐ తెలిపారు.

  • Loading...

More Telugu News