: రాణించిన ఫించ్, వార్నర్... ఢిల్లీ విజయలక్ష్యం 185
టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ధాటిగా ఆడింది. కేవలం ఒక్క వికెట్ నష్టపోయి 184 పరుగులు సాధించింది. ఐపీఎల్ 7 లో భాగంగా షార్జాలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 38 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగగా, అతడికి జతగా దిగిన ఆరోన్ ఫించ్ (88) ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ధావన్ ఔటవ్వడంతో బరిలో దిగిన వార్నర్ 31 పరుగుల వద్ద లైఫ్ అందుకున్నాడు. అంతే... బౌలర్ ఎవరనేది చూడకుండా బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో వార్నర్ 58 పరుగులు చేశాడు. దీంతో కేవలం ఒక వికెట్ నష్టపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయ లక్ష్యం 185 పరుగులు. ఢిల్లీ బౌలర్లలో నదీమ్ మాత్రమే వికెట్ తీయడం విశేషం.