: కేవీపీ అరెస్టుకు చర్యలు తీసుకోండి... గవర్నర్ కు చంద్రబాబు లేఖ
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అరెస్టుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. ఎంపీగా ఉండి టైటానియం కేసులో ఆయన రాష్ట్ర పరువు తీశారని మండిపడ్డారు. రహస్య ఒప్పందాలతో అంతర్జాతీయ స్థాయిలో పరువును మంటగలిపారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి అవినీతి చరిత్రగల నేతలను వెంటనే జైల్లో పెట్టాలని సూచించారు.