: తెలంగాణ పోరాట యోధుడి ప్రస్థానమే... ‘గులాబీ దళపతి’
గతంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు (రూ.999) అనే సినిమాకు దర్శకత్వం వహించిన పర్స రమేష్ మహేంద్ర మళ్లీ మెగాఫోన్ పట్టుకుంటున్నారు. ఈసారి ఆయన ‘గులాబీ దళపతి’ పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ ఆర్ట్స్ పతాకంపై గట్టు విజయ్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయటానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రస్థానమే ఈ చిత్ర కథాంశమని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సందర్భంగా ‘గులాబీ దళపతి’ సినిమా టీజరును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవిష్కరించారు. ఈ సినిమాకి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.