: అందుకే మేం కాంగ్రెస్ ను వదిలి... టీడీపీలో చేరాం: తోట వాణి
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరే సీమాంద్ర ప్రాంతానికి న్యాయం చేయగలరని తోట వాణి అన్నారు. కాకినాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి తోట నరసింహం తరపున ఆయన భార్య వాణి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాకినాడలో ఇవాళ వాణి మీడియాతో మాట్లాడుతూ... సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. గతంలో నిరాహార దీక్ష చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్నారు. ఆ సమయంలో టీడీపీయే తమకు మద్దతు తెలిపిందని ఆమె చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరామని ఆమె తెలిపారు.