: సినీ స్టార్లు ఓడిపోయారు.. క్రికెటర్లు గెలిచారు


సినీ స్టార్లపై క్రికెటర్లదే పైచేయి అయింది. ఓ ఛారిటీ సంస్థకు నిధులు సేకరించే నిమిత్తం టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్ సినీ తారలు సాకర్ మ్యాచ్ లో పాల్గొన్నారు. రాత్రి పూట జరిగిన ఈ మ్యాచ్ లో క్రికెటర్ల జట్టు 4-3తో సినీ స్టార్లపై విజయభేరి మోగించింది. నిరుపేద చిన్నారుల అభ్యున్నతి కోసం 'మ్యాజిక్ బస్ ఫౌండేషన్' స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దన్నుగా ఈ మ్యాచ్ నిర్వహించారు.

మ్యాజిక్.. ఫౌండేషన్ ఢిల్లీ డైనమిక్ విరాట్ కోహ్లీకి చెందినదిగా తెలుస్తోంది. నిధుల సేకరణే లక్ష్యంగా జరిగిన ఈ మ్యాచ్ లో క్రికెటర్ల జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించగా, బాలీవుడ్ జట్టుకు అభిషేక్ బచ్చన్ సారథిగా వ్యవహరించాడు. ఇక్కడి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన పోటీలో ఇరు జట్ల ఆటగాళ్ళు ప్రొఫెషనల్స్ ను తలపించారు.

కాగా, ఈ మ్యాచ్ లో 'బర్ఫీ' హీరో రణబీర్ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని లాఘవంగా డ్రిబ్లింగ్ చేస్తూ, క్రికెటర్ల గోల్ పోస్ట్ పై పలుమార్లు దాడులు చేసి బెంబేలెత్తించాడట. ఈ మ్యాచ్ లో చివరి వరకు అద్భుత ప్రదర్శన చేసిన బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ (రెండు గోల్స్)కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. భారత క్రికెటర్ల జట్టులో ధోనీ, కోహ్లీ, యువరాజ్, ఇషాంత్, తివారీ తదితరులు పాల్గొనగా.. బాలీవుడ్ జట్టులో అభిషేక్, రణబీర్, డినో మోరియా పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News