: విభజన పాపం అందరిదీ: కిరణ్
జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా డే అండ్ నైట్ సెంటర్ లో కిరణ్ మాట్లాడుతూ... విభజన పాపం అన్ని రాజకీయ పార్టీలది అన్నారు. చంద్రబాబు, జగన్ విభజనకు అంగీకరించడం వల్లే విభజన జరిగిందన్నారు. బీజేపీ తెలంగాణకు మద్దతు ఇచ్చిందని, కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందని, ఈ తరుణంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.