: లగడపాటి, కేటీఆర్ బిజినెస్ పార్ట్ నర్స్: ఓయూ జేఏసీ నేత


కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం మలిదశలో ఉన్నప్పుడు... కేసీఆర్ కావడి కిందపెడితే, విద్యార్థులందరు చదువు పక్కన పెట్టి కావడి భుజానికెత్తుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. కరీంనగర్ జిల్లా ముత్తారంలో కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ తో కలసి దరువు ఎల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ, సకలజనుల సమ్మెను కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు చేపడితే టీఆర్ఎస్ నేతలు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారని ఆరోపించారు. తెలంగాణను అనుక్షణం వ్యతిరేకించిన లగడపాటి రాజగోపాల్ తో టీఆర్ఎస్ నేత కేటీఆర్ కు వ్యాపార భాగస్వామ్యం ఉందని చెప్పారు. తెలంగాణ ద్రోహులకు, వ్యాపారవేత్తలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News