: కేవీపీని అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతివ్వాలి: చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా కోసిగిలో ముగిసింది. ప్రచారం సమయంలో ఆయన మాట్లాడుతూ, టైటానియం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును అరెస్టు చేసేందుకు గవర్నర్ నరసింహన్ అనుమతివ్వాలన్నారు. అనుమతి ఇచ్చి తన నిజాయతీ నిరూపించుకోవాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పోలీసుల జీతాలు పెంచేందుకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామనీ అన్నారు. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News