: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వసూళ్లపై విచారణ చేయిస్తాం: దానం


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్రమాస్తులపై విచారణకు సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని... తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ పై విచారణ జరిపి జైలుకు పంపుతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని తానే ప్రారంభించినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని... తెలంగాణ ఉద్యమం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి పుట్టిందని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దొంగ దీక్షను బయటపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News