: సాయంత్రం 5.30కు కేంద్ర కేబినెట్ భేటీ
ఈ సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపుపై ప్రధానంగా మంత్రివర్గం ఈ భేటీలో చర్చించనుంది. అంతేగాక ఏపీ రాష్ట్ర అసెంబ్లీ రద్దు అంశంపైన చర్చించే అవకాశం ఉందని తెలుస్తొంది. ఇప్పటికే ఇవే అంశాలపై మాట్లాడేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.