: ఆలోచించి ఓటు వేయండి: కేసీఆర్
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు సాధారణమైనవి కావని... చాలా ప్రాధాన్యత ఉందని... అందువల్ల బాగా ఆలోచించి ఓటు వేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. తెలంగాణను ఎవరి చేతిలో పెడితే సేఫ్ గా ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మన తలరాతను మనమే రాసుకోవాలని చెప్పారు. తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత టీఆర్ఎస్ దే అని అన్నారు.