: కలిస్ తో బ్యాటింగ్ నమ్మశక్యం కాని అనుభవం: క్రిస్ లిన్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం, ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ తో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభవమని సంచలన క్యాచ్ పట్టిన క్రిస్ లిన్ తెలిపాడు. షార్జాలో ఆయన మాట్లాడుతూ, కలిస్ క్రీజులో చాలా రిలాక్స్ డ్ గా ఉంటాడని అన్నాడు. ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో కలిస్ ను మించిన వారు లేరని లిన్ అభిప్రాయపడ్డాడు. తను పట్టిన సంచలన క్యాచ్ పై సంతృప్తి వ్యక్తం చేశాడు.