: పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గతంలో నిర్వహించిన పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగాయని సీఐడీ నిర్ధారించడంతో... ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు... పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని చెబుతూ... పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఎల్లుండి నుంచి ఈ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.