: నన్ను కొట్టారు...నేను కొట్టాను...తప్పెవరిదో అడగాలి కదా: ప్రకాశ్ రాజ్


తనపై చెలరేగిన వివాదం అంతా తప్పుడు వ్యవహారం అని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఒక వ్యక్తి కంకణం కట్టుకున్నాడని, అతనిని బయటకు తెచ్చేందుకే తాను మీడియా ముందుకు వచ్చానని అన్నారు. తనకు, దర్శకుడికి మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని, అయితే తప్పు ఎవరిది? అనేది వీడియో సాక్షిగా నిరూపిస్తానని ఆయన సవాలు విసిరారు. ఎవరో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై శిక్ష విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలని, తాను 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానని, తన గురించి ఇక్కడ అందరికీ తెలుసని ఆయన చెప్పారు. తాను ముక్కు సూటి మనిషినని, తనను ఒకరు కొడితే తాను వారిని కొట్టడం తప్పుకాదని, అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే కారణాన్ని ఆరా తీయాలని ఆయన సూచించారు. తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై గౌరవముందని, తనకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News