: క్రిస్ లిన్ క్యాచ్ సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు


కోల్ కతా నైట్ రైడర్స్ దశ మార్చిన క్రిస్ లిన్ క్యాచ్ ను క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించొచ్చని పలువురు క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఐపీఎల్ 7 లో భాగంగా షార్జాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన రోమాంఛిత మ్యాచ్ చివర్లో ఆస్ట్రేలియాకు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు క్రిస్టఫర్ ఆస్టిన్ లిన్ బౌండరీ లైన్ కు వెంట్రుక వాసి దూరంలో పట్టిన క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుంది.

అతను వెనుకకు దూకుతూ పట్టిన ఆ క్యాచ్ మ్యాచ్ ను గెలిపించడమే కాకుండా, క్రిస్ లిన్ కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు కలిసినా ఈ క్యాచ్ గురించే చర్చించుకోవడం విశేషం. దీనిపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.

  • Loading...

More Telugu News