: నానీ... వ్యక్తిగత విమర్శలు మానుకో: కోనేరు
విజయవాడలో నిన్న టీడీపీ లోక్ సభ అభ్యర్థి కేశినేని నాని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోనేరు ప్రసాద్ పై స్థానికేతరుడు అంటూ విమర్శలు గుప్పించిన విషయం విదితమే. దీనిపై కోనేరు ప్రసాద్ స్పందించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన కేశినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో పోటీకి రావాలని ఆయన సవాల్ విసిరారు. టైటానియం కేసు విషయం తనకు తెలియదని కోనేరు అన్నారు.