: ధర్మాన పిటిషన్ పై విచారణ 25కు వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసు, వాన్ పిక్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. ప్రాసిక్యూషన్ అనుమతితో ధర్మాన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై న్యాయస్థానంలో కొద్దిసేపటి కిందటే మంత్రి, సీబీఐ తరపు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.