: ఆస్ట్రేలియా వర్జిన్ బ్లూ విమానం హైజాక్
ఆస్ట్రేలియాకు చెందిన వర్జిన్ బ్లూ విమానం హైజాక్ అయింది. ఆ సమయంలో విమానం బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లేందుకు బయలుదేరింది. దాన్ని బాలి ఎయిర్ పోర్టులో బలవంతంగా ల్యాండ్ చేసినట్లు ఇండోనేషియా టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. అయితే, ఓ ప్యాసింజర్ కాక్ పిట్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో విమానం హైజాక్ అయిందని ఫైలెట్ అన్నట్లు ఇండోనేషియా ట్రాన్స్ పోర్టు అధికారులు చెబుతున్నారు.