: బొత్స సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైకాపాకు చెందిన 500 కుటుంబాలు
పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తాను పోటీ చేస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన 500 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. అనంతరం బొత్స మాట్లాడుతూ, నమ్మకంగా ఉండే నాయకుడికే ఓటు వేయాలని ప్రజలను కోరారు. కొంత మంది నేతలు ఆచరణసాధ్యం కాని హామీలతో ఓటర్లను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని... తాము మాత్రం చేయబోయేదే చెబుతున్నామని తెలిపారు.