: 'రియాలిటీ షో'కి మళ్లీ కుదరదన్న గుత్తా జ్వాల


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల హిందీ చానెల్ లో ప్రసారం అవుతున్న ఓ రియాల్టీ షోలో పాల్గొనేందుకు రెండో సారీ నో చెప్పింది. తమ రియాల్టీ షో 'ఝలక్ దికలాజా' షో లో పాల్గొనాలంటూ నిర్వాహకులు చేసిన విన్నపాన్ని జ్వాలా సున్నితంగా తిరస్కరించింది. ఇటీవల కాలంలో వెండితెరమీదా మెరిసేందుకు మొగ్గుచూపుతోన్న జ్వాలా ఈ దఫా ఒప్పుకుంటుందనుకున్న రియాల్టీ షో నిర్వాహకుల ఆశలు నెరవేరలేదు.
 
గతంలో ఇదే షోలో పాల్గొనాలని వచ్చిన పిలుపుకు కూడా ఈ బ్యాడ్మింటన్ సుందరి సానుకూలంగా స్పందించలేదు. అయితే ఈ దఫా చేద్దామనుకున్నా,  జూలై, ఆగష్టు మాసాల్లో టోర్నమెంట్లు ఉండటం మూలంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉండటంతో జ్వాలా ఈ అవకాశాన్ని తిరస్కరించిందని సమాచారం. మరో దఫా వీలు చిక్కితే తప్పక చేస్తానని జ్వాలా మాటిచ్చిందట కూడా.. 

  • Loading...

More Telugu News