: సీపీఐ, సీపీఎం కార్యకర్తలు కొట్టుకున్నారు
ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొణిజర్ల మండలం కొండవనమాలలో సీపీఐ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. అంతేకాదు, కర్రలు, బరిసెలతో దాడులకు తెగబడ్డారు. దీంతో పది మంది కార్యకర్తలు గాయాలపాలవ్వగా, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.