: మన్మోహన్ కు జూన్ 18లోగా సమన్లు ఇవ్వాలన్న యూఎస్ కోర్టు


భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు జూన్ 18లోగా సమన్లు అందివ్వాలని అమెరికా కోర్టు అక్కడి సిక్కుల మత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ కు డెడ్ లైన్ విధించింది. లేకుంటే ఆయనపై దాఖలైన మానవ హక్కుల ఉల్లంఘన కేసును కొట్టివేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమన్లు అందించినట్లు సాక్ష్యాన్ని జూన్ 18లోగా సమర్పించాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించారు. మన్మోహన్ తన పదవీ కాలంలో సిక్కులపై దాడులకు సహకారం అందించారని ఆరోపిస్తూ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కోర్టులో కేసు వేసింది. దీంతో వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు గతేడాది సెప్టెంబర్ లోనే మన్మోహన్ సింగ్ కు సమన్లు జారీ చేసింది. వాటిని అందించడానికి తాజాగా గడువు విధించింది.

  • Loading...

More Telugu News