: బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు ముందస్తు బెయిల్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ బీహార్ మాజీ మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కు ముందస్తు బెయిల్ లభించింది. అరెస్టు చేసేందుకు బీహార్, జార్ఖండ్ పోలీసు బృందం నిన్న (గురువారం) ఉదయం ఆయన ఇంటికి వెళ్లడంతో అప్పటికే గిరిరాజ్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరు చేసింది.