: షుగర్ నివారణకు ఇది కూడా దోహదపడుతుంది


ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి బారిన పడుతున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో స్థానిక వైద్యులు రోజుకో ఔషధం, వైద్య విధానం పేరిట షుగర్ వ్యాధిగ్రస్తులను బురిడీ కొట్టిస్తున్నారు. దీనిపై పరిశోధనలు చేసిన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు చిన్న జాగ్రత్త పాటిస్తే మధుమేహాన్ని నివారించవచ్చని నిరూపించారు. రోజుకో కప్పు కాఫీ తాగితే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం 11 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేల్చారు. రక్తంలో పేరుకున్న గ్లూకోజ్ నిల్వలను కాఫీ కరిగిస్తుందని వారు వివరించారు.

వైద్య రంగంలో పని చేసే దాదాపు లక్షా ముప్పై వేల మంది ఆహారపుటలవాట్లను పరిశీలించి, అధ్యయనం చేసి చివరకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. కాఫీ అలవాటు లేని, కప్పు కాఫీ కంటే తక్కువ తాగేవారికి టైప్ 2 మధుమేహం వచ్చినట్టు తెలిపారు. టైప్ 2 మధుమేహానికి, కాఫీ తాగే మోతాదుకి సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే రోజుకో కప్పు కాఫీ ఆరోగ్యకరమేనని, మధుమేహ నివారణకు దివ్యౌషధమని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News