: బాలకృష్ణకు హిందూపురం ఇవ్వడాన్ని తప్పుబట్టిన చిరు!


అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు బాలకృష్ణకు హిందూపురం సీటు కేటాయించడాన్ని కేంద్ర మంత్రి చిరంజీవి తప్పుబట్టారు. అక్కడి ముస్లింలను కాదని బాలయ్యకు టికెట్ ఎలా ఇస్తారని టీడీపీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో తాను సామాజిక న్యాయం చూశానన్న చిరు... టికెట్ల కేటాయింపులో తమ పార్టీ ఆ న్యాయాన్ని పాటించిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు బలం ఉంటే స్వతంత్రంగా పోటీ చేయకుండా బీజేపీతో కలసి ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. దారులు వేరైనా పవన్ ది, తనది ఒకటే గమ్యమని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టినట్లు పవన్ ను పక్కన పెట్టే పరిస్థితి ఉండదన్నారు.

  • Loading...

More Telugu News