: మోడీ ఓ జంతువు: బేణీప్రసాద్


కాంగ్రెస్ నేత బేణీప్రసాద్ వర్మ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మోడీని అతిపెద్ద గూండా అని వ్యాఖ్యానించి ఈసీ అక్షింతలకు గురైనా... ఆయన తన తీరు మార్చుకోలేదు. తాజాగా మోడీని జంతువుతో పోల్చారు. మోడీకి గుణపాఠం చెప్పాల్సి ఉందని కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మోడీని అతిపెద్ద గూండా అని వ్యాఖ్యానించినందుకు ఈసీ నిన్ననే బేణీకి షోకాజు నోటీసు పంపింది. ఆ లోపే బేణీ మరోసారి మోడీపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాహుల్ ప్రధాని అయితే, 2002 నాటి అల్లర్ల విషయంలో మోడీ, ఆయన అనుచరుడు అమిత్ షా జీవిత కాలం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే, మోడీ ప్రధాని కాలేరని, ఆయన శ్మశానానికి వెళ్లాల్సిందేనని కూడా పరుషంగా మాట్లాడారు. దీంతో ఈసీ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి చర్యలు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News