: సీమాంధ్ర మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
రానున్న ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రను సంపన్న రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణం, ఉపాధి కల్పనే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం కావాలంటే బలమైన నాయకుడు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ హవా మరింత పెరిగిందని చెప్పారు.