: కేసీఆర్, హరీష్ రావు, విజయశాంతి ఆస్తులపై విచారణకు సీబీఐ కోర్టు ఆదేశం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేత హరీష్ రావు, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆస్తులపై విచారణ జరపాలంటూ సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు న్యాయవాది బాలాజీ వడేరా నిన్న (గురువారం) ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీచేసింది.