: రాజీవ్ హంతకులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏడుగురు హంతకులు విడుదలయ్యేందుకు కోర్టు అనుమతించలేదు. కాగా, ఈ హత్య కేసును సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఇక వారిని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయాలా? వద్దా? అనేది ఈ ధర్మాసనమే నిర్ణయిస్తుందని పేర్కొంది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలని నిర్ణయిస్తూ తమిళనాడు ప్రభుత్వం రెండు నెలల కిందట అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర సర్కారుకు పంపిన సంగతి తెలిసిందే. దానిని వ్యతిరేకించిన కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హంతకుల విడుదలపై స్టే విధించింది.