: ప్రియాంకా... వాద్రా మీ భర్తేనా? లేక ఇంకా ఎవరైనా?: ఉమా భారతి


సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఓ దొంగ అని, అతడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి డిమాండ్ చేశారు. గతంలో మోడీపై తాను చేసిన విమర్శలను బయటపెట్టిన కాంగ్రెస్ పై ఆమె విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను ఆమె లక్ష్యంగా చేసుకున్నారు. వాద్రా ముఖ్యమైన వ్యక్తి కాదని, ఆయన పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. 'రాబర్ట్ వాద్రా ఎవరు? ఆయన విశ్వసనీయత ఏంటి? సోనియాగాంధీ కుమార్తెను వివాహం చేసుకున్న వ్యక్తి మాత్రమే. ప్రియాంకా చెప్పండి... వాద్రా మీ భర్తేనా? లేక ఇంకా ఎవరైనా?' అంటూ ఉమాభారతి మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒకటేనని చెప్పారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత 2007లో ఉమాభారతి మోడీని ఉద్దేశించి అభివృద్ధి కారకుడు కాదు, వినాశకుడు అని వ్యాఖ్యానించారు. అయితే, తన తప్పును మూడు రోజుల్లోనే గ్రహించానని, మోడీని తప్పుగా అర్థం చేసుకున్నానని ఆమె తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వాద్రా హర్యానాలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News