: జూ.ఎన్టీఆర్ ప్రచారంపై కొనసాగుతున్న సస్పెన్స్
గత కొంత కాలంగా టీడీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహిస్తాడా? లేదా? అనే విషయంలో ఇంకా సంధిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రచారానికి జూనియర్ రెడీ అయ్యాడని... తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇంతరకు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ఎన్టీఆర్ ప్రచారం విషయంలో నెలకొన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.