: ప్రచారంతో హోరెత్తించనున్న పవన్ కల్యాణ్... షెడ్యూల్ వివరాలు
ఇప్పటిదాకా ఎన్డీఏ నిర్వహించిన బహిరంగసభలకు మాత్రమే హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఇప్పుడు తమ కూటమి తరపున ప్రచారానికి సిద్ధమయ్యారు. బీజేపీ, టీడీపీ కూటమి తరపున తన ప్రచారంతో హోరెత్తించనున్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించి... అభివృద్ధికి బాటలు వేసుకోవాలంటూ ఓటర్లను కోరనున్నారు.
పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్...
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు షాద్ నగర్, 2.30కు కల్వకుర్తి, 4 గంటలకు సికింద్రాబాద్, 5 గంటలకు ఖైరతాబాద్, 7 గంటలకు శేరిలింగంపల్లి బహిరంగసభల్లో ఆయన ప్రసంగిస్తారు.
26వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా రామగుండం, 12.30కు సిరిసిల్ల, 2 గంటలకు హుస్నాబాద్, 3.30కు వరంగల్ జిల్లా పాలకుర్తి సభలకు ఆయన హాజరవుతారు.
27 వ తేదీ ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, 12 గంటలకు ఎల్బీ నగర్, 2.30కు సనత్ నగర్, 4 గంటలకు ముషీరాబాద్, 6 గంటలకు అంబర్ పేటల్లో ప్రచారం చేస్తారు.
28వ తేదీ ఉదయం 11 గంటలకు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, 12.30కు కామారెడ్డి, 2 గంటలకు బాల్కొండ లో ప్రచారం నిర్వహిస్తారు.
అంతేకాకుండా, వరంగల్ జిల్లా పాలకుర్తి టీడీపీ శాసనసభ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు, సికింద్రాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి బండారు దత్తాత్రేయలు పవన్ ను వ్యక్తిగతంగా కలసి తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరారు. దీంతో, వీరిరువురి తరపునా పవన్ కల్యాణ్ వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.