: శోభానాగిరెడ్డి కుటుంబానికి సంతాపం తెలిపిన జేపీ


శోభానాగిరెడ్డి హఠాన్మరణం బాధాకరమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శోభానాగిరెడ్డి, తానూ కొన్ని విషయాల్లో సలహాలు, సూచనలు పంచుకున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆమెది అందరితో కలిసిపోయే మనస్తత్వమని జేపీ అన్నారు. శోభానాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి తనకు రెండు దశాబ్దాల నుంచి తెలుసునని, ఆయన ఆవేదన ఎవరూ తీర్చలేనిదని జేపీ అన్నారు.

  • Loading...

More Telugu News