: నా సలహా వినండి.. కష్టాలనుంచి గట్టెక్కండి : ముత్యంరెడ్డి
విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాను సలహాలిస్తున్నా మంత్రి పొన్నాల, ట్రాన్స్ కో అధికారులు పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి వాపోయారు. విద్యుత్ చౌర్యం, పంపిణీలో నష్టాలను నివారిస్తే కరెంటు ఛార్జీలు పెంచనవసరం లేదని ఆయన అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ట్రాన్స్ కో అధికారులకు సూచించారు.
వ్యవసాయానికి నాణ్యమైన, తక్కువ సామర్థ్యం కలిగిన పంపు సెట్లు వాడితే విద్యుత్ ఆదా అవుతుందని ముత్యంరెడ్డి అన్నారు. మొన్ననే.. మెదక్ జిల్లా డీఆర్సీ సమావేశంలో ముత్యంరెడ్డి-ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ 'నువ్వెవడివంటే.. నువ్వెవడివిరా' అంటూ బాహాబాహీకి దిగి వార్తల కెక్కిన సంగతి తెలిసిందే.