: భారత్ లో సల్మాన్ ఖానే ఫిట్ నెస్ లో నెంబర్ వన్!
భారత్ లో కండల వీరుడు సల్మాన్ ఖానేనట. అవును, సల్మాన్ బాలీవుడ్ నటులైన హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్ లను పక్కకు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఆన్ లైన్ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో భారత్ లో ఫిట్ నెస్, హెల్దీగా ఉన్న నటుడుగా సల్మాన్ కు అత్యధిక మంది ఓటు వేశారు. ఈ సర్వేలో సుమారు 30 వేల మంది పైగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సర్వేలో సల్మాన్ ఖాన్ 43.36 శాతం ముందుండగా, హృతిక్ రోషన్ 42.81 శాతం ఓట్లతో తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, షాహీద్ కపూర్ లు ఉన్నారు.